BJP: ఖ‌మ్మంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌... సాయిగ‌ణేశ్ కుటుంబానికి ప‌రామ‌ర్శ‌

union minister rajiv chanrasekhar meets sai ganesh family in khammam
  • ఆత్మ‌హ‌త్య చేసుకున్న బీజేపీ కార్య‌క‌ర్త సాయి గ‌ణేశ్‌
  • టీఆర్ఎస్ నేత‌లు, పోలీసుల వేధింపులే కార‌ణ‌మంటున్న బీజేపీ
  • సాయి గ‌ణేశ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఖమ్మం వ‌చ్చిన కేంద్ర మంత్రి
  • ఇప్ప‌టికే బాధిత కుటుంబంతో ఫోన్ ద్వారా మాట్లాడిన అమిత్ షా
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ తెలంగాణ‌లోని ఖమ్మం చేరుకున్నారు. ఇటీవ‌లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న బీజేపీ కార్య‌కర్త సాయి గ‌ణేశ్ కుటుంబాన్ని ఆయ‌న పరామ‌ర్శించారు. టీఆర్ఎస్ నేత‌లు, పోలీసుల వేధింపుల కార‌ణంగా సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన‌ట్లుగా బీజేపీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం త‌ర్వాత ఆసుప‌త్రికి త‌ర‌లించగా...అక్క‌డ చికిత్స పొందుతూ సాయి గ‌ణేశ్ మృతి చెందాడు.

ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ తెలంగాణ శాఖ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ బుధ‌వారం నాడు త‌న పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చి దీక్ష‌కు దిగారు. ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా సాయి గ‌ణేశ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.
BJP
Telangana
Bandi Sanjay
Kammam

More Telugu News