Telangana: రోడ్డు ప్రమాదంలో నారా లోకేశ్ అనుచరుడు రాజవర్ధన్ రెడ్డి మృతి
తెలంగాణలో బుధవారం చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనుచరుడు రాజవర్ధన్ రెడ్డి మృతి చెందారు. గద్వాల జిల్లా పరిధిలోని ఉండవెల్లి సమీపంలో ఇటిక్యాలపాడు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రాజవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఇటిక్యాలపాడు వద్ద పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజవర్ధన్ రెడ్డి మృత్యువాత పడ్డారు.