పంజాబ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి సజీవ దహనం
- లుథియానాలోని తాజ్‌పూర్ రోడ్డులో అగ్ని ప్రమాదం
- ఓ గుడిసెలో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా మంటలు
- మృతుల్లో దంపతులు, వారి ఐదుగురు పిల్లలు
ఆ సమయంలో వేరే ప్రాంతంలో వీరి మరో కుమారుడు రాజేశ్(17) నిద్రించడంతో అతడు ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలాడని వివరించారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆ కుటుంబ సభ్యులు మృతి చెందారని అన్నారు. అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.