Radhika: మేము నిజంగా తెలుగువాళ్లమే: రాధిక

We are Telugu people says Radhika
  • మా నాన్న సొంతూరు తిరుపతి దగ్గర్లోనేనని చెప్పిన రాధిక 
  • ఆయన మాట్లాడే తెలుగు గమ్మత్తుగా ఉండేదని వెల్లడి 
  • తన అన్నదమ్ములిద్దరూ శ్రీలంకలో ఉన్నారని చెప్పిన రాధిక 
సీనియర్ నటి రాధిక అంటే అందరూ తమిళ వ్యక్తి అనుకుంటారు. అయితే తాము తెలుగువాళ్లమేనని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రి ఎంఆర్ రాధా సొంతూరు తిరుపతికి సమీపంలోనే వుందని చెపుతారని తెలిపారు. ఆయన మాట్లాడే తెలుగు కూడా గమ్మత్తుగా ఉండేదని చెప్పారు. 

తమిళంలో తనను తెలుగమ్మాయి అంటారని... తెలుగులో తమిళ అమ్మాయి అంటారని రాధిక నవ్వేస్తూ అన్నారు. తొలుత తనకు తెలుగు వచ్చేది కాదని... కానీ సినిమాల్లో నటించిన తర్వాత మంచి తెలుగు మాట్లాడుతున్నానని చెప్పారు. 

తనకు ఇద్దరు అన్నదమ్ములు, చెల్లెలు ఉన్నారని... అన్నదమ్ములిద్దరూ శ్రీలంకలో షిప్పింగ్ బిజినెస్ లో ఉన్నారని తెలిపారు. తన చెల్లెలు సినీ నటి నిరోషా అనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. 'అలీతో సరదాగా' టీవీ షోలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు.
Radhika
Tollywood
Kollywood
Telugu

More Telugu News