Maria Sharapova: తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన టెన్నిస్ తార మరియా షరపోవా.. తండ్రి ఎవరంటే..?

Maria Sharapova announces pregnancy
  • 35 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న షరపోవా
  • బ్రిటీష్ బిజినెస్ మేన్ అలెగ్జాండర్ తో ఎంగేజ్ మెంట్ అయినట్టు డిసెంబర్ లో ప్రకటన
  • బేబీ బంప్ ఫొటోను షేర్ చేసిన టెన్నిస్ తార
తన ఆటతోనే కాకుండా, అందంతో కూడా ప్రపంచ టెన్నిస్ ప్రియులను కట్టిపడేసిన టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 

నిన్న తన 35వ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసి... 'విలువైన ప్రారంభం' అని క్యాప్షన్ పెట్టింది. 2020లో టెన్నిస్ కు షరపోవా గుడ్ బై చెప్పింది. తన కెరీర్ లో ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచింది. ఇన్స్టాలో ఆమెకు 42 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. బ్రిటీష్ బిజెనెస్ మెన్ అలెగ్జాండర్ గిల్క్స్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు గత డిసెంబర్ లో షరపోవా వెల్లడించింది.
Maria Sharapova
Tennis
Mother
Pregnant

More Telugu News