Thalapathy Vijay: విజయ్ మాదిరి పీవీ సింధు స్టెప్పులేస్తే..?

PV Sindhu recreates Thalapathy Vijays hook steps from Arabic Kuthu
  • అరబిక్ కుతు ట్రాక్ కు సింధు డ్యాన్స్
  • బీస్ట్ సినిమాలో పాప్యులర్ సాంగ్   
  • హుషారుగా స్టెప్పులు వేసిన సింధు
  • ఇన్ స్టా గ్రామ్ లో భారీగా లైక్ లు
ఆటకే కాదు.. వినోదానికీ ప్రాధాన్యం ఇస్తుంది పీవీ సింధు. బ్యాడ్మింటన్ లో ఎన్నో కప్పులు కొట్టిన సింధు.. తాజాగా తమిళ్ హీరో విజయ్ మాదిరే అరబిక్ స్టెప్పులతో వీడియో విడుదల చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. (వీడియో ఇక్కడ)

విజయ్ ‘బీస్ట్’సినిమాలోని అరబిక్ కుతు ట్రాక్ సంచలనం సృష్టించడం తెలిసిందే. జీన్స్ మీద తెల్లటి స్కర్ట్ తో సింధు ఈ ట్రాక్ కు టెర్రాస్ పై హుషారుగా స్టెప్పులు వేసింది. వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి ‘అరబిక్ కుతు’ అని క్యాప్షన్ పెట్టింది. ఇది పోస్ట్ చేసిన 15 గంటల్లోనే 145000 లైక్ లు వచ్చాయి. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా లైక్ కొట్టింది.
Thalapathy Vijay
beast
Arabic Kuthu
PV Sindhu
dance

More Telugu News