Uttam Kumar Reddy: ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధిపతులంతా నా బ్యాచ్ మేట్సే!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Army Navy Airforce chiefs are my batchmates says Uttam Kumar Reddy
  • ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్న మనోజ్ పాండే
  • ఇప్పటికే ఎయిర్ పోర్స్ చీఫ్ గా వివేక్, నేవీ అధిపతిగా ఉన్న హరి కుమార్
  • వీరితో కలిసి ఎన్డీఏలో ఒకే బ్యాచ్ లో శిక్షణ పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మనోజ్ పాండే, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వివేక్ చౌధరి, నేవీ అధిపతి అడ్మిరల్ హరి కుమార్ తన బ్యాచ్ మేట్స్ అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారత 29వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే వచ్చే నెల 1న బాధ్యతలను స్వీకరించనున్నారు. 

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... వివేక్, హరి కుమార్, మనోజ్ పాండే, తాను అందరం 1979 జనవరి 1 నుంచి 1981 డిసెంబర్ 31 వరకు ఎన్డీఏలో 61 కోర్సులో శిక్షణ పొందామని చెప్పారు. తన బ్యాచ్ మేట్స్ ముగ్గురు ఒకే సమయంలో త్రివిధ దళాలకు నాయకత్వం వహించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. వీరి చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పారు.
Uttam Kumar Reddy
Congress
NDA

More Telugu News