Hanamkonda: పెళ్లి చేసుకోవాలంటూ కానిస్టేబుల్ వేధింపులు.. ఐసీడీఎస్ పర్యవేక్షకురాలి ఆత్మహత్య

Young Girl Committed Suicide after a constable compel to Marry
  • హనుమకొండ జిల్లా శాయంపేటలో ఘటన
  • పరిచయమైన కానిస్టేబుల్ పెళ్లి కోసం ఒత్తిడి
  • పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
తనకు పరిచయమైన ఓ కానిస్టేబుల్ పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తహరాపూర్‌కు చెందిన సంగీత (30) ఏటూరునాగారంలోని ఐసీడీఎస్‌లో పర్యవేక్షకురాలిగా పనిచేస్తోంది. హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సర్వేష్ యాదవ్‌తో ఇటీవల ఆమెకు పరిచయమైంది. 

ఈ క్రమంలో ఆమెపై మనసు పడిన సర్వేష్ తరచూ సంగీతకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని వేధించేవాడు. అతడి వేధింపులు శ్రుతిమించడంతో భరించలేని సంగీత ఇంటికొచ్చి పురుగుల మందు తాగింది. సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను పరకాలలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. సంగీత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hanamkonda
ICDS
Constable
Marriage

More Telugu News