CBI: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ

AP CM Jagan Illegal Assets Case Special court adjourned hearing
  • అక్రమాస్తుల కేసులో జగన్‌పై అభియోగాలు
  • సీబీఐ కేసుల నుంచి విముక్తి కల్పించాలని డిశ్చార్జ్ పిటిషన్
  • సీబీఐ గడువు కోరడంతో విచారణ వాయిదా
అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ గతంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ స్పందించింది. జగన్ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాల్సిన విచారణాధికారి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారని, కాబట్టి సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేకపోయామని నిన్న ప్రత్యేక కోర్టుకు తెలిపింది. 

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని కోరింది. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.
CBI
YS Jagan
Illegal Assets
Andhra Pradesh

More Telugu News