ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌తో ధ‌ర్మ‌పురి అర‌వింద్ భేటీ

nizamabad mp meets union ministers in delhi
  • ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ
  • కేంద్ర మంత్రులు గోయ‌ల్‌, కిష‌న్ రెడ్డి లతో భేటీ
  • తెలంగాణ అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డి
తెలంగాణ‌కు చెందిన బీజేపీ యువ‌నేత, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలో ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని వెంట‌బెట్టుకుని మ‌రో కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తో అర‌వింద్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌కు సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించిన‌ట్టు అర‌వింద్ తెలిపారు. తెలంగాణ‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌పైనే వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా స‌మాచారం.
Go Back to Shorts
Kishan Reddy
Piyush Goyal
Dharmapuri Aravind
Nizamabad MP

More Telugu News