TDP Mahanadu: నెల‌కు రెండు జిల్లాలు.. మ‌హానాడు త‌ర్వాత ఏపీ ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు

chandra babu tour begins after mahanadu
  • మే నెలాఖ‌రున మ‌హానాడు
  • మ‌హానాడు త‌ర్వాత రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు
  • ఎన్నికల నాటికి రాష్ట్ర ప‌ర్య‌ట‌న పూర్తి చేస్తాన‌న్న టీడీపీ అధినేత 
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు సిద్ధ‌మైపోయారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మే నెలాఖ‌రులో పార్టీ నిర్వ‌హించ‌నున్న మ‌హానాడు ముగిసిన త‌ర్వాత త‌న రాష్ట్రవ్యాప్త పర్య‌ట‌న మొద‌లవుతుంద‌ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. నెల‌కు రెండు జిల్లాల చొప్పున ఏపీలోని మొత్తం జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ఏడాదిలోగా పూర్తి చేయ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. 

మంగ‌ళ‌వారం నాడు పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశం అయిన త‌ర్వాత ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జ‌గ‌న్ పాల‌న‌ను విమ‌ర్శిస్తూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న త‌న రాష్ట్రవ్యాప్త ప‌ర్య‌ట‌న‌ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. మ‌హానాడు ముగిసిన వెంట‌నే ప్రారంభం కానున్న ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎన్నిక‌లు జ‌రిగే నాటికి మొత్తం రాష్ట్రాన్ని చుట్టేయ‌నున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.
TDP Mahanadu
TDP
Chandrababu
chandrababu Tour

More Telugu News