Jagan: హర్యానా సీఎంతో భేటీ కావడానికి వైజాగ్ వెళ్తున్న జగన్!

Jagan to meet Haryana CM Manohar Lal Khattar today in Vizag
  • నేచురోపతి ట్రీట్మెంట్ కోసం విశాఖకు వచ్చిన ఖట్టర్
  • పెమా వెల్ నెస్ సెంటర్ లో జరగనున్న భేటీ
  • విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్న సీఎం
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఏపీ సీఎం జగన్ ఈరోజు విశాఖలో భేటీ కానున్నారు. ఈ సమావేశం కోసం జగన్ విశాఖకు వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన తర్వాత ఉదయం 11.10 గంటలకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయంలోనే పార్టీ నేతలు, అధికారులతో అరగంట పాటు ఆయన సమావేశమవుతారు. అనంతరం రుషికొండలోని పెమా వెల్ నెస్ సెంటర్ కు వెళ్లి ఖట్టర్ ను కలుస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ఆయన తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. 

నేచురోపతి ట్రీట్మెంట్ కోసం ఖట్టర్ విశాఖకు వచ్చారు. ఇద్దరు సీఎంల భేటీ సాధారణమైనదే అని చెపుతున్నారు. అయితే, ఖట్టర్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కావడంతో... ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనే యాంగిల్ లో రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Jagan
YSRCP
Manohar Lal Khattar
Haryana

More Telugu News