Agastya: హీరోగా పరిచయం అవుతున్న అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య

Amitabh Bachchan grandson enters Bollywood with The Archies
  • ది ఆర్చీస్ చిత్రంతో అరంగేట్రం
  • ఇదే చిత్రం ద్వారా షారుఖ్ కుమార్తె, బోనీ కపూర్ కుమార్తె పరిచయం
  • జోయా అక్తర్ దర్శకత్వంలో చిత్రం
  • ఘనంగా ప్రారంభోత్సవం
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. అగస్త్య హీరోగా ది ఆర్చీస్ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సోమవారం  ప్రారంభోత్సం జరుపుకుంది. 

కాగా ఇదే చిత్రం ద్వారా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా, బోనీ కపూర్ చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. కాగా, మనవడు సినీ రంగప్రవేశం నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ స్పందించారు. అగస్త్యకు ఆశీస్సులు అందజేశారు. అంతేకాదు, తమ కుటుంబ కీర్తి పతాకం నిరంతరం ఎగురుతూ ఉండేలా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అగస్త్య... అమితాబ్ కుమార్తె శ్వేతా నందా కుమారుడు.
Agastya
Amitabh Bachchan
The Archies
Bollywood

More Telugu News