Telangana: ముంద‌స్తు ముచ్చ‌టే లేదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై బాల్క సుమ‌న్ వ్యాఖ్య‌

balka suman comments on pre polls in telengana
  • టీవీ డిబేట్‌లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • ముంద‌స్తు ఎన్నిక‌లన్న ప్ర‌చారాన్ని కొట్టిపారేసిన వైనం
  • నిర్ణీత కాల వ్య‌వ‌ధి ప్ర‌కార‌మే ఎన్నిక‌ల‌న్న సుమన్  
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌రుగుతున్న ప్ర‌చారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ కీల‌క వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ముంద‌స్తు ముచ్చ‌టే లేదంటూ ఆయ‌న తేల్చి పారేశారు. ఈ మేర‌కు నేటి సాయంకాలం ఓ టీవీ ఛానెల్ డిబేట్‌కు హాజ‌రైన ఆయ‌న గ‌తంలో మాదిరే టీఆర్ఎస్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కే మొగ్గు చూపుతోంద‌న్న ప్ర‌చారంపై స్పందిస్తూ పై వ్యాఖ్య చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోమ‌న్న బాల్క సుమ‌న్‌.. నిర్ణీత వ్య‌వ‌ధి ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. 
Telangana
Telangana Assembly Election
TRS
Balka Suman

More Telugu News