Nara Lokesh: రౌడీ షీట్ ఓపెన్ చేసినా నేను రెడీ... జ‌గ‌న్‌కు లోకేశ్ స‌వాల్‌!

nara lokesh fires on police case on him
  • క‌ల్యాణ‌దుర్గం కేసుపై లోకేశ్ ఆగ్ర‌హం
  • ఇప్ప‌టికి 12 కేసులు పెట్టార‌ని ఆరోప‌ణ‌
  • ప్ర‌జ‌ల సొమ్ము తిన్నందుకు కేసులు ఫైల్ కాలేదంటూ వ్యాఖ్య 
  • ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డినందుకే కేసుల‌న్న లోకేశ్
అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గంలో త‌న‌పైనా, త‌న తండ్రి నారా చంద్ర‌బాబునాయుడిపైనా పోలీసులు కేసు న‌మోదు చేసిన విష‌యంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం వ‌రుస‌గా సంధించిన రెండు ట్వీట్ల‌లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆయ‌న ఓ స‌వాల్ విసారారు. సాధార‌ణ కేసులు కాదు.. ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేసినా తాను సిద్ధ‌మేనంటూ లోకేశ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

ఆ ట్వీట్ల‌లో నారా లోకేశ్ పేర్కొంటూ... "ఇంత పిరికివాడివేంటి వైఎస్ జ‌గ‌న్‌? ప్రశ్నిస్తే కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటా. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టావ్. ఇప్పుడు కల్యాణదుర్గంలో మరో కేసు. నీలా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నా పై కేసులు లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నాపై కేసులు ఉన్నాయి. మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావ్...నెక్స్ట్ ఏంటి? రౌడి షీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.
Nara Lokesh
TDP
Police Case
Kalyanadurganm

More Telugu News