'ఎఫ్ 3' నుంచి వచ్చేస్తున్న సెకండ్ సింగిల్!

18-04-2022 Mon 19:01
  • ముగింపు దశకు చేరుకున్న 'ఎఫ్ 3'
  • డబ్బు చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ
  • ఈ నెల 22న సెకండ్ సింగిల్ 
  • మే 27న సినిమా రిలీజ్  
F3 movie update
వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను మాత్రమే వదిలారు. సెకండ్ సింగిల్ ను వదలడానికి తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ సినిమా నుంచి ఈ నెల 22వ తేదీన సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. మే  27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ఈ కథ అంతా కూడా డబ్బుకు సంబంధించిన ఫ్రస్ట్రేషన్ చుట్టూ తిరుగుతుంది.  

'ఎఫ్ 2'కు మించిన వినోదాన్ని ఈ సినిమా పంచుతుందని అనిల్ రావిపూడి బలంగా చెబుతున్నాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాలో, రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. మురళీశర్మ .. సోనాల్ చౌహాన్ .. అంజలి .. సంగీత ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.