Suriya: సినిమా సెట్టింగ్ కోసం కట్టిన ఇళ్లను పేదలకు ఇచ్చేస్తున్న తమిళ హీరో సూర్య

Tamil Hero Suriya humanitarian gesture towards poor fishermen
  • బాలా దర్శకత్వంలో నటిస్తున్న సూర్య
  • ప్రస్తుతం కన్యాకుమారిలో షూటింగ్
  • ఈ సినిమా కోసం మత్స్యకారుల వాడ సెట్టింగ్
  • సెట్టింగులోని ఇళ్లను కూల్చివేయరాదని నిర్ణయం
సినిమాల కోసం సెట్టింగులు వేయడం సాధారణమైన విషయం. అయితే, ఒరిజినాలిటీ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న నేటి తరం ఫిలింమేకర్లు... అసలు నిర్మాణాలను తలపించేలా సెట్టింగులు రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఆ సెట్టింగులను కూల్చివేస్తుంటారు. తమిళ హీరో సూర్య, దర్శకుడు బాలా కాంబినేషన్లో వస్తున్న చిత్రం కోసం ఈ విధంగానే కన్యాకుమారిలో భారీ ఎత్తున మత్స్యకారుల వాడను నిర్మించారు. 

అయితే, సామాజిక స్పృహ మెండుగా ఉన్న హీరో సూర్య కీలక నిర్ణయం తీసుకున్నారు. కన్యాకుమారిలో షూటింగ్ పూర్తయ్యాక సెట్టింగులోని ఇళ్లను కూల్చివేయకుండా, అక్కడి పేద జాలర్లకు వాటిని ఇచ్చేయాలని నిశ్చయించుకున్నారు. సొంత ఇళ్లు లేని మత్స్యకారులను గుర్తించి వారికి ఆ ఇళ్లను పంపిణీ చేసేలా సూర్య చర్యలు తీసుకున్నారు. 

సూర్య నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సూర్య నిజంగా హీరో అని, ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడుతున్నారు. సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతోమందికి సాయం చేశారు. పేద విద్యార్థులకు, వృత్తి పనివాళ్లకు ఆయన చేయూతనందించారు.
Suriya
Houses
Setting
New Movie
Bala

More Telugu News