Bhale Bhale Banjara: చిరంజీవి, రామ్ చరణ్ ల సిందాట... భలే భలే బంజారా పాట... ఆచార్య నుంచి కొత్త సాంగ్ విడుదల

  • చిరంజీవి, కొరటాల కాంబోలో ఆచార్య
  • కీలకపాత్రలో రామ్ చరణ్
  • చిరు, చరణ్ లపై భలే భలే బంజారా పాట
  • మణిశర్మ సంగీతానికి రామజోగయ్య సాహిత్యం
Bhale Bhale Banjara song from Acharya out now

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య చిత్రం నుంచి 'భలే భలే బంజారా' పాట విడుదలైంది. ఈ పాటలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ స్టెప్పులేయడంతో కొన్నిరోజులుగా ఈ పాట ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అభిమానులకు కనువిందు చేసే ఈ పాటను చిత్రబృందం నేటి సాయంత్రం పంచుకుంది. "సిరుతా పులుల సిందాటా... సరదా పులుల సయ్యాటా" అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. 

ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More Telugu News