Praveen Kumar: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను మరో శ్రీలంకగా మారుస్తుంది: ప్రవీణ్ కుమార్

KCR govt will make Telangana another Sri Lanka says Praveen Kumar
  • టీఆర్ఎస్ పాలన ఘోరంగా ఉందన్న ప్రవీణ్ కుమార్ 
  • ఉద్యోగాలను కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శ 
  • ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ ఓడిపోతారని వ్యాఖ్య 
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఘోరంగా ఉందని బీఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ ప్రభుత్వం తెలంగాణను మరో శ్రీలంకగా మారుస్తుందని చెప్పారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో చర్చించడానికే తాను బహుజన రాజ్యాధికార యాత్రను చేపట్టినట్టు తెలిపారు. 

అమరవీరుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని... కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. దళితులను మోసం చేసేందుకే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. యాసంగిలో పంటలు సాగు చేయని రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Praveen Kumar
BSP
KCR
TRS

More Telugu News