Telangana: పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. మళ్లీ నిబంధనలు అమలు చేసే అవకాశం!

  • దేశ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్లు
  • మాస్క్ నిబంధనను మళ్లీ అమలు చేసే అవకాశం
TS govt on alert amid raise in Corona cases in India

కరోనా థర్డ్ వేవ్ ముగిసిపోయి అంతా గాడిన పడుతోంది అనుకునే తరుణంలో దేశ వ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు క్రమంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఒక్క రోజులోనే కేసులు దాదాపు రెట్టింపయ్యాయి. మరోవైపు ఫోర్త్ వేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. మాస్క్ నిబంధనను మళ్లీ అమలు చేయాలని తెలంగాణ వైద్యశాఖ భావిస్తున్నట్టు సమాచారం. కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న క్రమంలో కోవిడ్ నిబంధనలను కూడా టీఎస్ ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ వచ్చింది. తాజాగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతుండటంతో... మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేసే అవకాశం ఉండొచ్చని సమాచారం.

More Telugu News