Ramakrishna Goud: మాజీ హోంగార్డు రామకృష్ణది పరువు హత్యేనని తేల్చిన పోలీసులు

Police busted former home guard Ramakrishna goud murder case
  • భార్గవిని ప్రేమ వివాహం చేసుకున్న రామకృష్ణ గౌడ్
  • రామకృష్ణపై కోపం పెంచుకున్న భార్గవి తండ్రి
  • లతీఫ్ సాయంతో హత్య చేయించిన వైనం
  • లక్డారం కాలువలో మృతదేహం
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాజీ హోంగార్డు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ గౌడ్ మిస్సింగ్ కేసు విషాదాంతం అయిన సంగతి తెలిసిందే. అతడి మృతదేహాన్ని సిద్ధిపేట జిల్లా లక్డారం వద్ద కనుగొన్నారు. ఇది పరువు హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో మొత్తం 11 మంది ఉన్నారని వెల్లడించారు. రామకృష్ణ... గౌరాయిపల్లికి చెందిన భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఈ పెళ్లి భార్గవి తండ్రి వెంకటేశ్వర్లుకు ఇష్టం లేదని భువనగిరి ఏసీపీ వెంకట్ రెడ్డి వెల్లడించారు. దాంతో లతీఫ్ అనే వ్యక్తిని ఈ హత్యకు పురమాయించాడని తెలిపారు. 

ఈ నేపథ్యంలో, భువనగిరిలో ఉంటున్న రామకృష్ణ గౌడ్ శుక్రవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదని, దాంతో అతడి భార్య భార్గవి.... లతీఫ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. లతీఫ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, భార్గవి తండ్రి వెంకటేశ్వర్లు ఈ హత్య చేయించినట్టు వెల్లడించాడని ఏసీపీ వివరించారు. ఈ హత్యకు తన భార్యతో పాటు మరో ముగ్గురు సహకరించారని లతీఫ్ చెప్పినట్టు వెల్లడించారు. రామకృష్ణ గౌడ్ మృతదేహాన్ని సిద్ధిపేట జిల్లా లక్డారం వద్ద ఓ కాలువలో పడేసినట్టు తెలిపారని వివరించారు.
Ramakrishna Goud
Murder
Police
Yadadri Bhuvanagiri District

More Telugu News