KTR: సన్ రైజర్స్ సంచలన పేసర్ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

KTR appreciates SRH sensational speedster Umran Malik
  • పంజాబ్ కింగ్స్ పై ఉమ్రాన్ మాలిక్ విశ్వరూపం
  • ఆఖరి ఓవర్లో 3 వికెట్లు తీసిన వైనం
  • కేటీఆర్ ఫిదా
  • ఐపీఎల్ లోనే అత్యుత్తమం అంటూ వ్యాఖ్యలు
ఉమ్రాన్ మాలిక్... గత ఐపీఎల్ వరకు అతడో అనామకుడు. కానీ ఈ సీజన్ తో తన సంచలన పేస్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 150 కిమీ వేగంతో బంతులు వేస్తూ, ప్రతి మ్యాచ్ లోనూ లక్ష రూపాయలు గెలుచుకుంటున్నాడు. అంతేకాదు, వికెట్ల వేటలోనూ దూసుకుపోతున్న ఈ కశ్మీరీ యువ ఫాస్ట్ బౌలర్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో పోరులో చివరి ఓవర్ లో ఉమ్రాన్ మాలిక్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 

ఈ తిరుగులేని ప్రదర్శనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అచ్చెరువొందారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. విపరీతమైన బలంతో ఉమ్రాన్ మాలిక్ విసిరే బంతులు నమ్మశక్యం కాని రీతిలో ఉంటున్నాయని కితాబిచ్చారు. బహుశా ఇవాళ్టి మ్యాచ్ లో అతడి ప్రదర్శన ఐపీఎల్ లోనే అత్యుత్తమం అయ్యుంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ యువ ఆటగాడికి అభివందనం చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.
KTR
Umran Malik
SRH
IPL

More Telugu News