ప్రీ వెడ్డింగ్ షూట్ లో అపశ్రుతి.... కొత్త జంటపై తేనెటీగల దాడి
- ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్
- పలుచోట్ల విషాదాంతాలు
- రంగారెడ్డి జిల్లాలో తాజా ఘటన
- తేనెటీగల దాడిలో గాయపడి ఆసుపత్రిపాలైన జంట
రంగారెడ్డి జిల్లా కోహెడకు చెందిన జంట త్వరలో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉండగా, ఈ జోడీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేందుకు నిర్ణయించుకుంది. అయితే, ఫొటోలు తీస్తున్న సమయంలో వీరిపై తేనెటీగలు దాడి చేశాయి. తప్పించుకునే లోపే వీళ్లపై తేనెటీగలు బాగా దాడి చేశాయి. దాంతో ఆ కొత్త జంటను ఆసుపత్రికి తరలించగా, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాంతో వారి కుటుంబాల్లో తీవ్ర విచారం నెలకొంది.