Budda Venkanna: ఏమి స్టోరీ చెప్పారు... నెల్లూరు ఎస్పీపై బుద్ధా వెంకన్న విమర్శనాస్త్రాలు

Budda Venkanna satires on Nellore SP explanation
  • నెల్లూరు కోర్టులో చోరీ
  • ఇద్దరిని అరెస్ట్ చేశామన్న ఎస్పీ
  • వారు ఇనుము దొంగతనానికి వచ్చారని వెల్లడి
  • కుక్కలు అరిస్తే భయపడి కోర్టు రూమ్ లో చొరబడ్డారని వివరణ
నెల్లూరు కోర్టులో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం ఎస్పీ విజయరావు మీడియాకు వివరాలు తెలిపారు. ఆ ఇద్దరు పాత నేరస్తులు అని, వారిపై అనేక చోరీ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. వారు కోర్టు ఆవరణలో ఇనుము దొంగతనం చేయడానికి వెళ్లారని, అక్కడ కుక్కలు అరవడంతో భయపడి, కోర్టు భవనంలో ఓ గది తాళం పగులగొట్టి దాంట్లోకి ప్రవేశించారని వెల్లడించారు. వారు అందులో ఓ బీరువా ఓపెన్ చేసి అందులోని బ్లూ కలర్ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయారని వివరించారు. 

ఎస్పీ వివరణపై టీడీపీ అగ్రనేత బుద్ధా వెంకన్న విమర్శనాస్త్రాలు సంధించారు. ఎస్పీ గారు ఏమీ స్టోరీ చెప్పారు అంటూ సెటైర్ వేశారు. ఐరన్ దొంగతనానికి వెళ్లి కుక్కలు మొరగడంతో భయపడి కోర్టు రూమ్ పగులగొట్టారని, కేవలం కాకాణి ఆధారాలు మాత్రమే పట్టుకుని వచ్చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఐరన్ దొంగలు, కుక్కలు, బ్యాగు... కథ బలే ఉంది కదా అంటూ బుద్ధా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎస్పీ వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.
Budda Venkanna
Nellore SP
Court Theft Case
Kakani

More Telugu News