'కేజీఎఫ్ 2' నుంచి మదర్ సెంటిమెంట్ ప్రోమో!

  • ఈ నెల 14న విడుదలైన 'కేజేఎఫ్ 2'
  • యష్ జోడీగా శ్రీనిధి శెట్టి 
  • యష్ తల్లి పాత్రలో అర్చన జోస్ 
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డుల నమోదు
KGF 2 Movie Update

యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' సినిమాను రూపొందించాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను కొల్లగొడుతూ ముందుకు వెళుతోంది.

ఈ సినిమాలో బంగారు గనులు .. వాటి చుట్టూ అల్లుకున్న మాఫియా నేపథ్యం ఉంటుంది. కేవలం బంగారం కోసం మాత్రమే హీరో పోరాడటమనేది ఉండదు. బంగారం విషయంలో తల్లికి ఇచ్చిన మాట .. అతణ్ణి ఆలా ముందుకు నడిపిస్తూ  ఉంటుంది. 'పేదవాడిగా పుట్టడం నీ తప్పుకాదు .. కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది నీ తప్పే' అనే తల్లిమాట వెంటే అతను నడుస్తాడు. 

 ఇలా ఈ సినిమాలోని భారీ పోరాటాల వెనుక .. బలమైన మదర్ సింటిమెంట్ కనిపిస్తుంది. అందువల్లనే అందుకు సంబంధించిన ప్రోమోను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో సంజయ్ దత్ .. ప్రకాశ్ రాజ్ .. రవీనా టాండన్ .. రావు రమేశ్ .. ఈశ్వరీ రావు కనిపిస్తారు. 

More Telugu News