KL Rahul: ముంబయి ఇండియన్స్ పై కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ.... లక్నో భారీ స్కోరు

LSG set huge target to Mumbai Indians after skipper KL Rahul blistering ton
  • ఊచకోత కోసిన రాహుల్
  • 59 బంతుల్లో 103 రన్స్
  • 9 ఫోర్లు, 5 సిక్సులు బాదిన వైనం
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 రన్స్ చేసిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్ సారథి, డాషింగ్ ఆటగాడు కేఎల్ రాహుల్ జూలు విదిల్చాడు. ముంబయి ఇండియన్స్ తో పోరులో రాహుల్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. ముంబయి బౌలర్లను ఊచకోత కోసిన రాహుల్ మొత్తం 59 బంతులాడి అజేయంగా 103 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. 

ఐపీఎల్ లో ఇది కేఎల్ రాహుల్ కు 100వ మ్యాచ్ కావడం విశేషం. తన వందో మ్యాచ్ లో వంద పరుగులతో చిరస్మరణీయం చేసుకున్నాడు. అంతేకాదు, ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ కు ఇది మూడో సెంచరీ. 

రాహుల్ సెంచరీ సాయంతో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 24, మనీష్ పాండే 38, స్టొయినిస్ 10, దీపక్ హుడా 15 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కట్ 2, మురుగన్ అశ్విన్ 1, ఫాబియెన్ అలెన్ 1 వికెట్ తీశారు.
KL Rahul
Century
Ton
LSG
Mumbai Indians
IPL

More Telugu News