రజనీకి విపరీతంగా నచ్చేసిన 'కేజీఎఫ్ 2'

  • ఈ నెల 14న విడుదలైన 'కేజీఎఫ్ 2'
  • ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు 
  • సినిమా చూసిన రజనీకాంత్
  • నిర్మాతపై ప్రశంసలు  
KGF 2 Movie Update

రజనీకాంత్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'అన్నాత్తే' ఆయన అభిమానులను నిరాశ పరిచింది. తెలుగులో 'పెద్దన్న' పేరుతో వచ్చిన ఈ సినిమా, ఇక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయినా ఆ విషయాన్ని గురించి పెద్దగా పట్టించుకోకుండా, రజనీ తన 169వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

సాధారణంగా రజనీ తనకి ఒక సినిమా నచ్చినా .. ఆర్టిస్టుల .. సాంకేతిక నిపుణుల టాలెంట్ నచ్చినా నేరుగా వారికే కాల్ చేసి అభినందిస్తుంటారు. అలా తాజాగా ఆయన 'కేజీఎఫ్ 2' నిర్మాతకు కాల్ చేసి ప్రశంసించారట. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. 

సినిమా చూసిన వెంటనే రజనీ .. ఈ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ కి కాల్ చేసి ప్రశంసించారట. ఈ సినిమా టీమ్ కి అభినందనలు అందజేశారనీ, సినిమా తనకి చాలా బాగా నచ్చిందని చెప్పారనేది కోలీవుడ్ టాక్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి అలరించింది.

More Telugu News