Bandi Sanjay: ఇది ముమ్మాటికీ మంత్రి అజయ్ కుట్రలో భాగంగా జరిగిన ప్రభుత్వ హత్య: బండి సంజయ్

Bandi Sanjay slams TRS leaders after BJP worker committed suicide in Khammam district
  • ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య
  • తీవ్రంగా స్పందించిన బండి సంజయ్
  • పీడీ యాక్ట్ కేసంటూ పోలీసులు వేధించారని వెల్లడి
  • 16 అక్రమ కేసులు బనాయించారని ఆరోపణ
ఖమ్మం జిల్లాలో సాయి నగేశ్ అనే బీజేపీ కార్యకర్త మృతిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు మితిమీరిపోయాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కండకావరం కారణంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి నగేశ్ పై 16 అక్రమ కేసులు బనాయించారని బండి సంజయ్ ఆరోపించారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు వేధించడంతో సాయి నగేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బండి సంజయ్ పేర్కొన్నారు. 

స్థానిక మంత్రి అక్రమాలు, ప్రభుత్వ అవినీతిని ప్రస్తావించడమే ఆ యువకుడు చేసిన పాపం అని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ మంత్రి అజయ్ కుట్రలో భాగంగా జరిగిన ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఆయనను వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi Sanjay
CM KCR
Puvvada Ajay Kumar
BJP
TRS
Telangana

More Telugu News