Pinipe Viswarup: ఆర్టీసీ చార్జీల పెంపుపై ఏపీ ర‌వాణా శాఖ మంత్రి విశ్వ‌రూప్ స్పంద‌న ఇదే

  • అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ స్వామి సేవ‌లో మంత్రి
  • ఆర్టీసీ చార్జీల పెంపు బాధాక‌ర‌మేనని వ్యాఖ్య 
  • ఆర్టీసీని కాపాడుకోవ‌డానికి అనివార్య‌మ‌న్న విశ్వ‌రూప్‌
ap transport minister commnets on rtc charges hike

ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచుతూ వైసీపీ స‌ర్కారు ఇటీవ‌లే నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. చార్జీల పెంపు సంద‌ర్భంగా ఆర్టీసీ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేశారు. అయితే మంత్రిగా ఇటీవ‌లే ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన పినిపే విశ్వ‌రూప్ కొత్తగా ద‌క్కిన ర‌వాణా శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌ని నేప‌థ్యంలో మీడియా ముందుకు రాలేదు. తాజాగా శ‌నివారం అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ స్వామిని ద‌ర్శించుకున్న సంద‌ర్భంగా ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆయ‌న స్పందించారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ...  'ప్ర‌మాణం చేసిన‌ వెంట‌నే ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి రావ‌డం బాధాక‌ర‌మే. ఆర్టీసీని బ‌తికించుకోవాలంటే చార్జీల పెంపు అనివార్య‌మ‌ని భావించాం. అందుకే ఇష్టం లేకున్నా చార్జీలు పెంచాల్సి వ‌చ్చింది. తెలంగాణ‌తో పోలిస్తే మ‌న రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు త‌క్కువే. డీజిల్ ధ‌ర‌లు త‌గ్గ‌గానే డీజిల్ సెస్‌ను ఎత్తేవేసేందుకు య‌త్నిస్తాం' అని  మంత్రి చెప్పుకొచ్చారు.

More Telugu News