Harbhajan Singh: నా నెల జీతాలు మొత్తం వాళ్లకే.. దాతృత్వాన్ని చాటుకున్న హర్భజన్ సింగ్

Harbhajan Donates His Salaries For Farmers Daughters Education
  • రైతుల కూతుర్ల చదువుకు ఇస్తానని వెల్లడి
  • దేశాభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని కామెంట్
  • ఆప్ తరఫున ఇటీవలే రాజ్యసభకు వెళ్లిన మాజీ క్రికెటర్
మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎంపీగా తనకు వచ్చే నెలవారీ వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ‘‘ఒక రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం నా వేతనాన్ని వారికే ఇచ్చేస్తున్నా. మన దేశం అభివృద్ధి చెందేందుకు నా వంతు సాయం చేస్తాను’’ అని ట్వీట్ చేశారు. 

కాగా, ఇటీవల హర్భజన్ సింగ్ ఆప్ తరఫున రాజ్యసభకు ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు.
Harbhajan Singh
Rajya Sabha
MP
AAP

More Telugu News