Phonecall: రైలు మీద నుంచి వెళ్లినా చలించని యువతి.. తీరిగ్గా పట్టాలపైనే కూర్చుని ఫోన్ కాల్

Woman Calmly Talks On Phone As Train Passes Over Her
  • యువతి పైనుంచి వెళ్లిన గూడ్స్ రైలు 
  • ఎటువంటి గాయాలూ కాని వైనం  
  • ఆ తర్వాత తీరిగ్గా స్టేషన్ నుంచి బయటకు
  • ట్విట్టర్లో షేర్ చేసిన ఐపీఎస్ అధికారి కాబ్రా
రైలు మీద నుంచి వెళ్లి ప్రాణాలతో బయటపడితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? షాక్ తో కొంతసేపటి వరకు తేరుకోలేరు. కానీ, ఈ యువతి అలా కాదు. ఆమెపై నుంచి గూడ్సు రైలు వెళ్లిపోగా, క్షేమంగా బయటపడింది. రైలు వెళ్లిన వెంటనే ఆ యువతి కంగారుగా పైకి వచ్చేయలేదు. లేచి పట్టాలపైనే కూర్చుని సెల్ ఫోన్ తీసి కాల్ మాట్లాడుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా ట్విట్టర్ లో ఈ నెల 12న పోస్ట్ చేశారు. ఇప్పటికే దీన్ని లక్ష మంది చూశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలను పేర్కొనలేదు.

‘ఫోన్లో కబుర్లు చెప్పుకోవడం ఎంతో ముఖ్యం’’ అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. పట్టాల నుంచి నింపాదిగా స్టేషన్ లోకి వచ్చిన యువతి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీన్ని ఎవరో కానీ, చక్కగా వీడియో తీసి పది మందికి జాగ్రత్తలపై స్పృహ కలిగేలా చొరవ చూపారు. ‘అదృష్టంతో ఆమె శరీర భాగాలు ఏవీ రైలుకు తాకలేదు. లేదంటే ముక్కలయ్యేది’ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. ఆ యువతిని అరెస్ట్ చేయాలని కోరుతూ కొందరు ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేశారు
Phonecall
railway track
woman

More Telugu News