Roja: పది మందికి సేవ చేయడానికి ఏదో ఒకటి వదులుకోవాలి: ఏపీ మంత్రి రోజా

Roja response on quitting Jabardasth
  • ఎమ్మెల్యే కావడం నా కల.. ఇప్పుడు మంత్రిని కూడా అయ్యానన్న రోజా 
  • కాంగ్రెస్ లోకి రావాలని అప్పట్లోనే వైయస్ ఆహ్వానించారని వెల్లడి 
  • ఇకపై రాజకీయాల్లో నవ్వులు పూయిస్తానని చెప్పిన మంత్రి 
ఎమ్మెల్యే కావడం తన కల అని... ఇప్పుడు మంత్రి కూడా అయ్యానని రోజా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ కోసం తాను ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. జగన్ మంత్రివర్గంలో పని చేయడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లోకి రావాలని అప్పటి సీఎం వైయస్ ఆహ్వానించారని.. అయితే అప్పుడు కుదరలేదని.. వైయస్ మీద ఉన్న అభిమానంతోనే వైసీపీలోకి వచ్చానని చెప్పారు. 

గతంలో ఒంటిమిట్ట రథోత్సవానికి వచ్చినప్పుడు జగన్ ను సీఎం చేయమని మొక్కుకున్నానని... తన కోరిక నెరవేరినందుకు మరోసారి కల్యాణోత్సవానికి హాజరవుతున్నానని రోజా తెలిపారు. జబర్దస్త్ కార్యక్రమంపై మాట్లాడుతూ, పది మందికి ఉపయోగపడాలంటే ఏదో ఒకటి వదులుకోక తప్పదని అన్నారు. ఇకపై బుల్లితెరపై కాకుండా రాజకీయాల్లో నవ్వులు పూయిస్తానని చెప్పారు.
Roja
Jagan
YSRCP
Jabardasth

More Telugu News