Maharashtra: టిఫిన్ ఆలస్యం చేసిందని.. కోడలిని కాల్చి చంపిన మామ!

Maharashtra man kills daughter in law over delay in serving breakfast
  • మహారాష్ట్రలోని థానేలో ఘోరం
  • లైసెన్స్ డ్ రివాల్వర్ తో కాల్పులు
  •  చికిత్స పొందుతూ మరణించిన ఇల్లాలు
  • నిందితుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు 
బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం కావడం ఆ ఇల్లాలి ప్రాణాన్ని బలి తీసుకుంది. టిఫిన్ చేసే వరకు ఓపిక పట్టలేని మామ సొంత కోడలిపైనే కాల్పులు జరిపి పరారయ్యాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ దారుణం జరిగింది. 

పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. సీమా రాజేంద్ర గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేస్తోంది. ఆమె మామ కాశీనాథ్ పాటిల్ (76) ఓ వ్యాపారవేత్త. తనకు సమయానికి టిఫిన్ పెట్టలేదన్న కోపంతో లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. 

గాయపడిన సీమా రాజేంద్రను థానేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తున్న క్రమంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె మరణించినట్టు శుక్రవారం ఉదయం వైద్యులు ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు వెల్లడించారు. 



Maharashtra
kills
daughter in law
breakfast

More Telugu News