Ananya Nagalla: అంజలి, ఆనంది బాటలోనే... అనన్య నాగళ్ల!

Ananaya Nagallla in Shashi Kumar Movie
  • 'మల్లేశం' సినిమాతో పరిచయం 
  • 'వకీల్ సాబ్'తో మంచి గుర్తింపు
  • కోలీవుడ్ నుంచి వచ్చిన ఛాన్స్
  • దర్శకుడిగా పా.శరవణన్
తెలుగు తెరపై తెలుగు అమ్మాయిలకి అవకాశాలు తక్కువ అనే విమర్శ చాలా కాలం నుంచే ఉంది. ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టమవుతూ ఉండటంతో, తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అక్కడ పాప్యులర్ అయిన తరువాత తెలుగు నుంచి కూడా అవకాశాలు వచ్చేలా చూసుకుంటున్నారు.

స్వాతి రెడ్డి .. అంజలి .. ఆనంది ఈ బాటలో ముందుకు వెళ్లినవారే. తమిళంలో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తరువాత తెలుగుకు వచ్చిన వారే. ఇప్పుడు అదే జాబితాలో అనన్య నాగళ్ల పేరు కూడా చేరినట్టుగా తెలుస్తోంది. 'మల్లేశం' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఇక 'వకీల్ సాబ్' సినిమాతోను ఆకట్టుకుంది.

ఆశించిన స్థాయిలో ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో, ఆమె కోలీవుడ్ బాట పట్టినట్టుగా చెబుతున్నారు. తమిళంలో శశికుమార్ జోడీగా ఆమెకి ఛాన్స్ వచ్చిందట. పా. శరవణన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా  ట్రావెల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. మిగతా తెలుగు అమ్మాయిల మాదిరిగానే అనన్య అక్కడ తన సత్తా చాటేస్తుందేమో చూడాలి.
Ananya Nagalla
Shashi Kumar
Kollywood

More Telugu News