విమానంలో కలకలం.. ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి మంటలు
- దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానం
- ప్రయాణికుడి ఫోన్ నుంచి మంటలు, పొగ
- వేగంగా స్పందించి ఆర్పివేసిన క్యాబిన్ క్రూ
- ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం
ఈ ప్రమాదం కారణంగా ఎవరికీ గాయాలు కాలేదు. విమాన సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇండిగో సంస్థకు చెందిన 6ఈ 2037 విమానం అసోంలోని దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుడి ఫోన్ నుంచి మంటలు, పొగ రావడాన్ని గమనించిన విమాన సిబ్బందిలో ఒకరు వేగంగా స్పందించి అగ్నిమాపక యంత్రం సాయంతో ఆర్పివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. సదరు విమానం సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.