Alia Bhatt: సోషల్ మీడియాను ఊపేస్తున్న అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి ఫొటోలు.. మీరూ చూడండి!

Alia Bhatt and Ranbir Kapoor marriage pics
  • నిన్న ముంబైలో జరిగిన అలియా, రణబీర్ ల వివాహం
  • పెళ్లికి అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం
  • తమకు ఇష్టమైన ప్రదేశంలో ఇద్దరం ఒక్కటయ్యామన్న అలియా
బాలీవుడ్ ప్రేమ జంట అలియా భట్, రణబీర్ కపూర్ ఒక ఇంటివారయ్యారు. వీరి వివాహం ముంబైలో వేడుకగా జరిగింది. రణబీర్ కపూర్ నివాసంలో జరిగిన ఈ పెళ్లికి వధూవరుల కుటుంబసభ్యులతో పాటు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, కరణ్ జొహార్, అయాన్ ముఖర్జీ తదితరులు పెళ్లింట సందడి చేశారు. 

అలియ భట్ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేష్ భట్ తన చేతిపై అల్లుడు రణబీర్ కపూర్ పేరును హెన్నాతో రాసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వివాహం సందర్భంగా అలియా ఇన్స్టాలో స్పందిస్తూ... తమకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో ఇద్దరం ఒక్కటయ్యామని చెప్పింది. గత ఐదేళ్లుగా తాము కబుర్లు చెప్పుకున్న బాల్కనీ సాక్షిగా పెళ్లి చేసుకున్నామని తెలిపింది. వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవే ఇవి... ఓ లుక్కేయండి.. 
Alia Bhatt
Ranbir Kapoor
Marriage
Pics

More Telugu News