Vontimitta: ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరాముడి బ్రహ్మోత్సవాలు.. నేడు సీతారాముల కల్యాణం

Lord Sri Rama and Goddess Sita Marriage today in vontimitta
  • నేటి సాయంత్రం ఒంటిమిట్టకు జగన్
  • సీతారాములకు పట్టువస్త్రాల సమర్పణ
  • కల్యాణం అనంతరం కడపకు సీఎం
ఒంటిమిట్టలో నేటి రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. సాయంత్రం ఒంటిమిట్ట చేరుకుని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకిస్తారు.

అనంతరం కడప వెళ్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న ఉదయం శ్రీరాముడు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చాడు. ఒంటిమిట్ట వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఇక, రాములోరి కల్యాణ ఏర్పాట్లను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి నిన్న పరిశీలించారు. వసతుల కల్పన, అన్నప్రసాదం, ముత్యాల తలంబ్రాల పంపిణీకి సంబంధించి కలెక్టర్ విజయరామారావు, ఎస్పీ అన్బురాజన్, జేఈవో వీరబ్రహ్మం, జేసీ సాయికాంత్ వర్మ, ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు.
Vontimitta
Andhra Pradesh
Lord Sri Rama
YS Jagan

More Telugu News