Girl: ఢిల్లీలో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన యువతి.. ప్రాణాలు కాపాడిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. వీడియో ఇదిగో

a girl jumped from Akshardham Metro Station
  • అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్ వద్ద ఘటన
  • సీఐఎస్ఎఫ్ సిబ్బంది నచ్చజెప్పినా వినిపించుకోని యువతి
  • కింద దుప్పటితో ఆమెను పట్టుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది
  • స్వల్ప గాయాలతో బయటపడిన యువతి
ఢిల్లీలో ఓ యువతి మెట్రో స్టేషన్ పైనుంచి దూకేసింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తతతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కిన ఓ యువతిని చూసిన ఇతర ప్రయాణికులు వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కిందికి దిగి రావాలంటూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారి మాటలను పట్టించుకోని యువతి ఒక్కసారిగా కిందికి దూకేసింది. 

మరోవైపు, కిందనున్న కొందరు సిబ్బంది ఓ దుప్పటిని గట్టిగా పట్టుకుని యువతి అందులో పడేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఆమె పడిన వేగానికి నేలకు బలంగా తాకడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 22 ఏళ్ల వయసున్న ఆమెను పంజాబ్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సీఐఎస్ఎఫ్.. వేగంగా, తెలివిగా స్పందించి యువతి ప్రాణాలు కాపాడినట్టు పేర్కొంది.
Girl
Akshardham
Metro Station
New Delhi

More Telugu News