ఏపీలో మొట్టమొదటి మొబైల్ సినిమా థియేటర్... ఎలా ఉందో చూడండి!

  • తూ.గో.జిల్లా రాజానగరం వద్ద మొబైల్ థియేటర్
  • థియేటర్ సామర్థ్యం 120 సీట్లు 
  • ఆచార్య సినిమాతో ఓపెనింగ్
  • అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే థియేటర్
First mobile cinema theater in Andhra Pradesh at Rajanagaram

ఏపీలో వినూత్న రీతిలో మొట్టమొదటిసారిగా మొబైల్ సినిమా థియేటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద పిక్చర్ డిజిటల్స్ అనే సంస్థ ఈ మొబైల్ థియేటర్ ను రూపొందిస్తోంది. ఎక్కడ్నించి ఎక్కడికైనా తరలించే వీలున్న ఈ థియేటర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రారంభించనున్నారు. దీన్ని ఓ ట్రక్కులో తరలించవచ్చు. 

దీన్ని అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా రూపొందించారు. అగ్నిప్రమాదాలను సైతం ఇది తట్టుకుంటుంది. దీనికి సంబంధించిన టెంట్ ను గాలితో నింపుతారు. ఇది ఏసీ థియేటర్ కాగా, దీని సామర్థ్యం 120 సీట్లు. ఏపీలో ఈ తరహా థియేటర్లలో ఇదే మొదటిది. రాజానగరం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న హాబిటేట్ ఫుడ్ కోర్టు ఆవరణలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
.

More Telugu News