Andhra Pradesh: కావాలంటే బియ్యం, వద్దంటే న‌గ‌దు.. రేష‌న్ బియ్యంపై ఏపీ మంత్రి కారుమూరి

ap minister commentson ration distribution
  • రేష‌న్ పంపిణీలో కొత్త విధానాన్ని చెప్పిన ఏపీ మంత్రి
  • బియ్యం వ‌ద్ద‌ని డిక్ల‌రేష‌న్ ఇస్తే న‌గ‌దు ఇస్తామని వెల్లడి  
  • ముందుగా మూడు మునిసిపాలిటీల్లో అమ‌లు చేస్తామ‌న్న మంత్రి కారుమూరి 
రేష‌న్ బియ్యం పంపిణీపై ఏపీలో కొత్త‌గా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కారుమూరి నాగేశ్వ‌ర‌రావు గురువారం నాడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రేష‌న్ బియ్యం కావాల‌నుకునే వారికి బియ్యాన్నే పంపిణీ చేస్తామ‌న్న మంత్రి... బియ్యం వ‌ద్ద‌నుకునే వారికి ఆ బియ్యం ఖ‌రీదు మొత్తాన్ని న‌గ‌దు రూపంలో అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు.

ఈ మేర‌కు బియ్యం వ‌ద్ద‌నుకునే వారి నుంచి డిక్ల‌రేష‌న్ తీసుకున్న త‌ర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా న‌గ‌దు జ‌మ చేస్తామ‌ని మంత్రి తెలిపారు. ఈ ప్ర‌తిపాద‌న‌పై ఇప్ప‌టికే ఓ డ్రాఫ్ట్ త‌యారైంద‌ని చెప్పిన మంత్రి... సీఎం జ‌గ‌న్ నుంచి ఆమోదం ల‌భించిన వెంట‌నే ప్రారంభిస్తామ‌న్నారు. తొలుత మూడు మునిసిపాలిటీల్లో ఈ త‌రహా విధానాన్ని అమ‌లు చేస్తామ‌ని, ఆ త‌ర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేసే దిశ‌గా చర్య‌లు తీసుకుంటామ‌ని కారుమూరి తెలిపారు.
Andhra Pradesh
RationDistribution
Karumuri Nageswara Rao

More Telugu News