Priyanka Chopra: తొలిసారి తన కూతురు గురించి చెప్పిన ప్రియాంక చోప్రా.. పెంపకం గురించి వివరణ

Priyanka Chopra For The First Time Reveals About Her daughter
  • నా భయాలు, ఆలోచనలు, ఆశయాలను ఆమెపై రుద్దనన్న ప్రియాంక 
  • పిల్లలు మన ద్వారా మాత్రమే వస్తారు.. మన నుంచి రారని వ్యాఖ్య 
  • ఆ సిద్ధాంతాన్నే పాటిస్తానని చెప్పిన ప్రియాంక 
బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తొలిసారి తన కూతురి గురించి స్పందించింది. తల్లిగా తాను ఏం చేయాలనుకుంటున్నది, పెంపకం గురించి చెప్పింది. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులకు ‘అద్దెగర్భం’ ద్వారా పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లిల్లీ సింగ్ అనే జర్నలిస్ట్ కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో.. ఆమె ప్రియాంకచోప్రాతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రియాంక తన కూతురు గురించి చెప్పుకొచ్చింది. 

ఓ తల్లిగా తన భయాలు, కలలు, ఆశయాలను తన బిడ్డపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దబోనని చెప్పింది. పిల్లలు ఎప్పుడైనా ‘మన ద్వారా మాత్రమే వస్తారుగానీ.. మన నుంచి రారు’ అని వ్యాఖ్యానించింది. పిల్లలు మన ద్వారా వచ్చి వారి జీవితాన్ని నిర్మించుకుంటారంది. ఇదే సిద్ధాంతాన్ని తన కూతురు విషయంలో అనుసరిస్తానని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పింది. 

తన తల్లిదండ్రులు తనపై ఎప్పుడూ ఆధిపత్యం చూపించలేదని, తనను స్వతంత్రంగా ఉండనిచ్చారని చెప్పింది. కాగా, ప్రియాంక చోప్రా తల్లిదండ్రులిద్దరూ వైద్యులే కావడం విశేషం. తల్లి మధు చోప్రా, తండ్రి దివంగత అశోక్ చోప్రా ఇద్దరూ ఆర్మీలో వైద్యులుగా సేవలందించారు. 
Priyanka Chopra
Surrogacy
Bollywood
Hollywood
Nick Jonas

More Telugu News