Yash: రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో అనుబంధంపై కన్నడ హీరో యశ్ స్పందన

Kannda hero Yash opines on his bonding with Ram Chanran and NTR
  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్-2
  • విస్తృతంగా ప్రమోషన్ కార్యక్రమాలు
  • సుమకు ఇంటర్వ్యూ ఇచ్చిన యశ్
కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన చిత్రం కోసం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న యశ్... ప్రముఖ తెలుగు యాంకర్ సుమతోనూ ప్రత్యేకంగా ముచ్చటించారు. 

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తెలుగు అగ్ర కథానాయకులు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తన అనుబంధాన్ని వివరించారు. తాను హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నానని తెలిస్తే రామ్ చరణ్ ఇంటి నుంచే భోజనం వస్తుందని యశ్ వెల్లడించారు. రామ్ చరణ్ తో తన స్నేహం ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. 

ఇక ఎన్టీఆర్ ఓసారి తనను భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించాడని, ఆ సమయంలో ఆయన కుటుంబం ఎంతో ఆప్యాయంగా తనకు స్వాగతం పలికిందని యశ్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా, ఎన్టీఆర్ తల్లిగారైన శాలిని ఎంతో వాత్సల్యంతో చూసుకున్నారని తెలిపారు. శాలిని గారిది కర్ణాటక కావడంతో, తమ మధ్య ప్రాంతీయ అనుబంధం ఏర్పడిందని వివరించారు. ఎన్టీఆర్ ఇంట్లో తనను సొంత మనిషిలా చూసుకున్నారని, అందుకు శాలిని గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని యశ్ వెల్లడించారు.
Yash
Ram Charan
NTR
Shalini
KGF-2
Kannada
Tollywood

More Telugu News