Cricket: ఏంటా విధ్వంసం.. శివాలెత్తిపోయిన బ్రూవిస్ ను చూసి మైదానంలోకి వచ్చేసిన సచిన్, రోహిత్.. ఇవిగో వీడియోలు

  • నిన్న పంజాబ్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్
  • జూనియర్ ఏబీ బ్రూవిస్ సంచలన ఇన్నింగ్స్ 
  • ఒకే ఓవర్ లో ఒక ఫోర్, 4 సిక్సర్లు
  • స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లో సలహాలిచ్చిన మెంటార్, కెప్టెన్
Sachin and Rohit Enters Into Field After Brevis Destruction

నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ, ఓ 18 ఏళ్ల కుర్రాడి ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. జూనియర్ ఏబీ డివిలియర్స్ గా పేరు తెచ్చుకున్న డెవాల్డ్ బ్రూవిస్ నిన్న సృష్టించిన విధ్వంసం గురించే అంతా. 

అప్పటిదాకా నిదానంగా ఆడిన ఆ కుర్రాడు.. 16 బంతుల్లో కేవలం 16 పరుగులే చేసిన ఆ పిల్లాడు.. ఒక్కసారిగా టాప్ గేర్ లోకి వెళ్లిపోయాడు. రాహుల్ చాహర్ వేసిన 9వ ఓవర్ లో విశ్వరూపమే చూపించాడు. వరుసగా 4, 6, 6, 6, 6తో శివాలెత్తాడు. ఐదు వరుస బంతులను బౌండరీగా మలిచాడు. 

అతడి బీస్ట్ మోడ్ ను చూసి ముంబై మెంటార్ సచిన్ టెండూల్కర్, హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే, కెప్టెన్ రోహిత్ శర్మలు మైదానంలోకి వచ్చేశారు. నవ్వుతూ అతడికి సలహాలిచ్చారు. ఆ ఓవర్ అయిపోగానే తీసుకున్న స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లో మైదానంలోకి వచ్చిన వారు బ్రూవిస్ తో పాటు క్రీజులో ఉన్న తిలక్ వర్మకూ సలహాలిచ్చారు. 

అయితే, 25 బంతుల్లోనే 49 పరుగులు చేసిన బ్రూవిస్.. ఓడియన్ స్మిత్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి అదే ఊపులో భారీ షాట్ ఆడి అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. అతడు ఔట్ కావడంతో ముంబైపై ఒత్తిడి బాగా పెరిగింది. తిలక్ వర్మ, పొలార్డ్ లు రనౌట్ కావడమూ జట్టును దెబ్బ తీసింది. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

  • Loading...

More Telugu News