Devineni Uma: జాతీయ ర‌హ‌దారిపై బ‌స్సులు ఆపి నిర‌సన తెలిపిన దేవినేని ఉమ‌

devineni slams ycp
  • ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఉమ నిర‌స‌న‌
  • వెంట‌నే ఛార్జీలు త‌గ్గించాల‌ని ఆందోళ‌న‌
  • గొల్లపూడిలో నిరసన కార్యక్రమం
అమ‌రావ‌తిలోని గొల్ల‌పూడిలో టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు నేతృత్వంలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఆర్టీసీ ఛార్జీలను వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. జాతీయ ర‌హ‌దారిపై దేవినేని ఉమ‌ బ‌స్సులు ఆపి నిర‌స‌న తెలిపారు. 

'టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడి పిలుపు మేరకు ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్ జ‌గ‌న్ "బాదుడే బాదుడు" కార్యక్రమాలపై బస్సులో ప్రయాణికులకు, ప్రజలకు అవగాహన కల్పించేలా వివరిస్తూ పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని గొల్లపూడిలో నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది' అని దేవినేని ఉమ అన్నారు.
Devineni Uma
Telugudesam

More Telugu News