ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని

14-04-2022 Thu 11:16
  • ప్రాణ నష్టం బాధించిందన్న ప్రధాని 
  • మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మోదీ 
  • గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్ 
PM modi reaction on ELURU fire incident
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడడం తెలిసిందే. యూనిట్ 4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలిపోవడం అగ్ని ప్రమాదానికి దారితీసినట్టు భావిస్తున్నారు. 

‘‘ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు కెమికల్ యూనిట్ లో ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరగడం బాధించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.