ఏపీ జడ్జిలు వద్దంటూ తెలంగాణ హైకోర్టు వద్ద ఆందోళన

  • ఏపీ జడ్జిలను తెలంగాణకు బదిలీ చేస్తున్నారని అభ్యంతరం
  • సీజేఐకి ఫిర్యాదు చేస్తామన్న తెలంగాణ న్యాయవాదులు
  • తెలంగాణకు చెందిన జడ్జిలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయొద్దని కోరుతామన్న లాయర్లు
Protest at TS High Court demanding no judges from AP

తెలంగాణ హైకోర్టుకు ఏపీకి చెందిన జడ్జిలను బదిలీ చేస్తున్నారంటూ హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ జడ్జిలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ... ఏపీ జడ్జిలను తెలంగాణకు బదిలీ చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ జడ్జిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన జడ్జిలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయొద్దని కోరతామని అన్నారు.

More Telugu News