Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్లదాడి.. కారు ధ్వంసం

stone attack on telangana Congress leader VH
  • హైదరాబాద్ అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటిపై దాడి
  • పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును కూడా ధ్వంసం చేశారు. తన ఇంటిపై జరిగిన రాళ్లదాడిపై వీహెచ్ స్పందించారు. దాడికి పాల్పడినవారిని గుర్తించాల్సింది పోలీసులేనని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
VH
Congress
Stone Attack
Telangana

More Telugu News