Eluru: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి

Blast in chemical manufacturing unit kills 6
  • పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
  • గ్యాస్ లీకై అంటుకున్న మంటలు
  • రియాక్టర్ పేలడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురి మృతి
  • ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.

క్షతగాత్రులను నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Eluru
Chemical Factory

More Telugu News