YSRCP: ఎమ్మెల్యే కూతురు వ‌ర్సెస్ సీఐ... తిరుప‌తిలో వైసీపీ నిర‌స‌న‌

ysrcp mlas daugter angry over circle inspector in renigunta
  • వైసీపీ శ్రేణులపై సీఐ దురుసు ప్రవ‌ర్త‌న‌
  • ప్ర‌శ్నించేందుకు వ‌చ్చిన ఎమ్మెల్యే కూతురు
  • సీఐ, ఎమ్మెల్యే కూతురు మ‌ధ్య వాగ్వాదం
  • సీఐ తీరుకు నిర‌స‌న‌గా వైసీపీ నిర‌స‌న‌
తిరుప‌తి స‌మీపంలోని రేణిగుంట ప‌రిధిలో బుధ‌వారం అధికార వైసీపీ శ్రేణులు భారీ నిర‌స‌న‌కు దిగాయి. రేణిగుంట అర్బ‌న్ సీఐ, శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి కుమార్తెల మ‌ధ్య నెల‌కొన్న వాగ్వివాద‌మే ఈ నిర‌స‌న‌కు కార‌ణమ‌ని వైసీపీ శ్రేణులు పేర్కొన్నాయి. సీఐ తీరుకు నిర‌స‌న‌గా వైసీపీ శ్రేణులు రేణిగుంట‌లోని ర‌మ‌ణ విలాస్ స‌మీపంలో నిర‌స‌న‌కు దిగాయి.

పార్టీ శ్రేణుల ప‌ట్ల రేణిగుంట అర్బ‌న్ సీఐ అంజు యాద‌వ్ దురుసుగా ప్ర‌వ‌ర్తించారన్న ఆరోప‌ణ‌ల‌తో అక్క‌డికి చేరుకున్న ఎమ్మెల్యే మ‌ధుసూద‌న రెడ్డి కుమార్తె సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా సీఐ ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డంతో సీఐ తీరును నిర‌సిస్తూ ఎమ్మెల్యే కుమార్తెతో క‌లిసి వైసీపీ శ్రేణులు అక్క‌డిక‌క్క‌డే నిర‌స‌న‌కు దిగాయి.
YSRCP
Biyyapu Madhusudana Reddy
Renigunta

More Telugu News