AP High Court: సేవ‌పై స‌మీక్షించాల‌న్న ఐఏఎస్ శ్రీలక్ష్మి... కుద‌ర‌ద‌న్న హైకోర్టు

  • కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో శ్రీలక్ష్మి స‌హా 8 మంది ఐఏఎస్‌ల‌కు శిక్ష‌
  • ఐఏఎస్‌లంతా సారీ చెప్ప‌డంతో సేవ‌గా మార్పు
  • శ్రీలక్ష్మి పిటిష‌న్‌ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
ap high court squashes ias srilakshmi petition

ఏపీ కేడ‌ర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తాజాగా హైకోర్టులో షాక్ త‌గిలింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో శిక్ష‌కు గురైన శ్రీలక్ష్మి అక్క‌డిక‌క్క‌డే క్ష‌మాప‌ణ చెప్ప‌డంతో ఆ శిక్ష‌ను సేవ‌గా మారుస్తూ ఇటీవ‌ల ఏపీ హైకోర్టు తీర్పును వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఏడాది పాటు నెల‌కో రోజు ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల్లో సేవ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం విదిత‌మే.

అయితే ఈ సేవ విష‌యంలో పునఃస‌మీక్ష చేయాలంటూ శ్రీల‌క్ష్మి తాజాగా హైకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను తొలుత విచార‌ణ‌కే స్వీక‌రించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాక‌రించ‌గా.. తాజాగా శ్రీలక్ష్మి త‌ర‌ఫు న్యాయివాది వివ‌ర‌ణ‌తో పిటిష‌న్‌ను విచార‌ణ‌కు అనుమ‌తించారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు శ్రీలక్ష్మి పిటిష‌న్‌ను కొట్టివేసింది.

More Telugu News